పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0395-1 శుద్దవసంతం సంపుటం: 11-565

పల్లవి: ఎంతవాఁడ వైన నిన్ను నింత సేసితి
         యింతిని నాయపరాదా లెట్టోరిచే వయ్యా

చ. 1: చేర రమ్మంటే రా నైతి చెక్కులు చేత గిల్లితి
       గారవించఁగా నిన్ను గసరితిని
       కూరిమి గొసరఁగాను కోపాన జంకించితిని
       యీరీతి నాయపరాధా లె ట్టోరిచే వయ్యా

చ. 2: మనసు నొప్పించితిని మాట లెల్లా నాడితిని
        చెనకఁగా వద్దని పైఁ జేయి వేసితి
        పెనఁగితి నీతోడఁ బ్రేమము రెట్టించఁగాను
        యెనసి నాయపరాదా లె ట్టోరిచే వయ్యా

చ. 3: కందువులు నీ వంటఁగా గాఁగిలించితి సిగ్గున
       విందుల నీరతులకు వేసరుకొంటి
       అందుకొని శ్రీవెంకటాధిప నిన్నుఁ గూడితి
       నిందు నాయపరాదా లె ట్టోరిచే వయ్యా