పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0394-4 ఆహిరి సంపుటం: 11-562

పల్లవి: నాతో నూరకే నీవు నవ్వేవు గాక
         రాతిరి నీమాఁట వూరక పోవ నిచ్చేవా

చ. 1: కొంకక నీవును నేనుఁ గూడి యున్న రతివేళ
       బింకము లాడుచు నట్టె పెనఁగితివి
       అంకెల నాకుచములు అంతవేఁగు లని నీవు
       జంకెనతో ములిగేవు సత్తు వెల్లా నిట్టిదా

చ. 2: మంచముపై నిద్దరము మంతన మున్నంతపడి
       కంచువలె వాఁగెను నీ గబ్బికుత్తికె
       కొంచపు నామాట లివి కొండలనెల లనుచు
       యించుకలో భ్రమసేవు యిట్టిదా నీవోరుపు

చ. 3: మోవి మోవిఁ గూడి తేనె ముసరి యానినఁదాకా
       నీవు నే న నెరఁగవు నిండఁ జొక్కుచు
       శ్రీవెంకటేశుఁడు గోరఁ జెనకితేఁ దెలిసేవు
       యీవల నీతో కూటము లిటుంటివా