పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0394-2 కేదారగౌళ సంపుటం: 11-560

పల్లవి: విచ్చనవి డాయ నేఁడు వెర పేల యిఁక నీకు
         నిచ్చల మాయమనసు నే మే మనే మయ్యా

చ. 1: కన్నుల మొక్కితిమీ కాఁకలఁ జిక్కితిమీ
       సన్నలు మాతో నింకాఁ జాలదా అయ్యా
       వెన్నెలలే యెండ లాయ వేగి యిది వొ ద్దాయ
       నిన్నుఁ గాక వచ్చె నిట్టె నే మే మనే మయ్యా

చ. 2: యిచ్చక మాడితిమీ యింతగా నోడితిమీ
       మచ్చిక లింకా మాతో మానవా అయ్యా
       రచ్చలో నిన్నుఁ గంటిమి రాతిరే వింటిమి మాట
       నెచ్చెలిచేఁ జెప్పెంపేవు నే మే మనే మయ్యా

చ. 3: కుందువ తెరిగితిమీ కాఁగిటఁ గరఁగితిమీ
       సందడి నవ్వేవు మాతో చలమా అయ్యా
       యిందుకె శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
       నింద లెల్లాఁ బాసె నిన్ను నే మే మనే మయ్యా