పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0393-5 రామక్రియ సంపుటం: 11-557

పల్లవి: నే మెటుల నుండినాను నీ కేమి
         వేమరు మామీఁది ద్రిష్టి విడువవు నీవు

చ. 1: సెలవి నే నగితేను చేరి య దేమిటి కంటా
       నలరి చెప్పు మనుచు నాన వెట్టేపూ
       తలఁకేవు నీ వ దేమి తప్పు నీవల్లఁ గలదా
       తెలసుకో నీకు నీకే తేటతెల్ల మిఁకను

చ. 2: ముక్కుపై వే లిడుకొంటే ముంచి యేపని కనుచు
       గుక్కక తెలుపు మని కొంగు వట్టేవు
       మక్కువ నీవల్ల ననుమాన మైనఁ గలదా
       చక్క నీవే దిద్దుకొమ్ము చల మేల యిఁకను

చ. 3: తప్పక నేఁ జూచితేను తమకించితి ననుచు
       కప్పి కప్పి నన్ను నట్టె కాఁగిలించేవు
       యిప్పుఢె శ్రీవెంకటేశ యెనసితి విటు నన్ను
       అప్పటి కిప్పుడు నీవే అందము సేసుకొమ్మీ