పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0393-4 గుజ్జరి సంపుటం: 11-556

పల్లవి: ఆలుక గాదు నీతో నన్నిటా మన్ననదాన
         చలపట్టి యందరితో సరి సేయ కిఁకను

చ. 1: చిత్తము నొవ్వకుమీ చెప్పే నే నొకమాట
       హత్తిమంచ మెక్కు మన కంతే చాలు
       యిత్తల నీ కూడిగాలు యెన్ని యైనఁ జేసేఁ గాని
       పొత్తుల యెంగిలితోడి బోగము సయించదు

చ. 2: ఆనలు వెట్టకుమీ అడిగే నే కొకయీవి
       పూని నాతోడ నవ్వకు పొందులే చాలు
       కానిమ్మని నీవద్ద నేఁ గాచుకుండే నేపొద్దు
       సానఁ బట్టేసరసాలు చవి గాదు నాకును

చ. 3: చేతుల మొక్కకుమీ సేసేఁ గాని నీమాఁట
        రాతిరి నన్నుఁ గూడినరతులే చాలు
        యీతల శ్రీవెంకటేశ యిప్పుడు నన్నుఁ గూడితి
        కాతరాన నీతోడఁ గపట మెరఁగనూ