పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0393-3 సాళంగం సంపుటం: 11-555

పల్లవి: ఆన వెట్టినా మానరు అప్పటి మీరు
         పానిపట్టి చెలులార పగదాన నటరే

చ. 1: యెదురుమాటలు నేర యెవ్వరితో నేఁ బోర
       వొదిగి వొకరీతి న న్నుండ నీరే
       అదన నండఁ గూచుండ నాతని సరివారమా
       పొదిగి నా కేల మీరు బుద్ది చెప్పేరే

చ. 2: వట్టి పూడిగాల కోప వాదు లాతనిపై మోప
       వెట్టికి మొక్కి నన్నేల వెఱ్ఱిఁ జేసేరే
       యిట్టె నన్నాతఁ డే మన్నా నే మాయ లే దంటా
       నొట్టు వెట్టుకొనె నంటా నొడఁబరచకురే

చ. 3: మంతనా లంతే నెఱఁగ మతిఁ దనకు మొఱఁగ
       యెం తయినఁ దనకాఁగి లేల మానేనే
       యొంతలోనే శ్రీవెంకటేశుఁడు దానె కూడె
       పొంత నన్ను నాతనిఁ బొగడ నేమిటికే