పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0393-1 శుద్దవసంతం సంపుటం: 11-553

పల్లవి: ఇప్పు డేల చవు లయ్యీ నింపులు చాలనిపొందు
         చప్ప నైనా నుప్ప నౌను సమ్మ తైతేఁ గాకా

చ. 1: చలము సాదించేచోట సలిగెలు చెప్పఁ బోతే
       ములుచదాన ననవా మొదల నీవే
       వలచినవేళ నెంత వడి నేఁ గోపించినాను
       తల ఱాయి సేసుకొని తగులుదు గాక

చ. 2: నయము చాలనిచోట నవ్వులు నవ్వఁగఁ బోతే
       బయకారించె ననవా పక్కన నీవే
       ప్రియము గలవేళను బిగి నెంత నే నుండినా
       దయ వుట్టి నీవు నన్ను దగ్గరుదు గాక

చ. 3: తమకము లేనిచోట తతిఁ బెనఁగఁగఁ బోతే
        భ్రమసి వున్న దనవా పై పై నీవే
        అమర శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితిని
        సమ మై యేకతవేళ సత మైతి గాకా