పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0392-5 కొండమలహరి సంపుటం: 11-551

పల్లవి: నేనే కాదు చెలు లెల్ల నీగణ మెరుఁగుదురు
         నానినవలపు చెప్ప నాతో నేల యిఁకనూ

చ. 1: మంతనాన మీ రిద్దరు మచ్చిక ముచ్చ టాడఁగ
       వింతలుగా మీ సుద్దులు విననా నేసు
       యింతలో నే నగిగితే యేరుపడఁ గత చెప్పే
       వంతరంగ మెఱఁగదా ఆన లేల యిఁకను

చ. 2: మొదలనె మీకళల మొకములలో తేట
       కదిసి చూచితి నిట్టె కానాన నేను
       అదన నే నవ్వితేను అట్టె తెర వేసేవు
       కదిమి నాతో నయగార మేల యిఁకను

చ. 3: పచ్చి గాఁగ నింటిలోన పానుపుపైఁ గూడినది
       యెచ్చరికె లెరఁగనా యిప్పుడే నేను
       అచ్చపు శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితిని
       ముచ్చిమి దీరినమీఁద మొక్కు లేల యిఁకను