పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0392-4 సాళంగం సంపుటం: 11-550

పల్లవి: ఎఱఁగ రాదు మీ గుట్టు యి ట్టుండ వలదా
         అఱమఱపులే కంటి మవ్వల దెలియదు

చ. 1: అట్టె నీమొగము చూచి అతివ నవ్విననవ్వు
       వట్టి శిగ్గుతో నీ తల వంచినవంపు
       దట్టపు వెన్నెలకును తామెర ముకుళించిన
       ఆ ట్టాయఁ గాని మాకు నవ్వల దెలియదు

చ. 2: చేతి పూవుబంతిఁ గొని చెలియ వేసినవాటు
       యీతల నంతలో నీ చె య్యెత్తిన మొక్కూ
       ఘాత మరునమ్ములకు గవిశనవలె నాయ
       నాతుమలోపల మాకు నవ్వల దెలియదు

చ. 3: తరుణి నీమంచానకు దగ్గరి వచ్చినరాక
       నిరతి శ్రీవెంకటేశ నీకూటమి
       గరిమఁ బాలును నీరు గలసినయ ట్టాయ
       ఆరు దందితిమి మాకు నవ్వల దెలయదూ