పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0392-3 నాదరామక్రియ సంపుటం: 11-549

పల్లవి: అంతే కలితే నీ ఆతనివద్దికి రావే
         కాంతరో అన్నియుఁ దారుకాణించె నిపుడు

చ. 1: యేమి సేసినో యంటా నేకతాన దగ్గిరితే
       కామించి యాతఁడు నన్నుఁ గరఁగించెనూ
       నీమనసున విభుని నేనే యంటితి నంటా
       మోము చూచి నవ్వేవు మొరసి యే ముందునే

చ. 2: సూడు వట్టి నే నాతని జూజ మాడఁ బిలిచితే
       కూడఁ బట్టి తానె దక్కఁ గొనె నన్నునూ
       తోడనె వెంగె మావేడు దొమ్మినేఁ జేసితి నంటా
       ఆడియు నాడవు నన్ను నందుకు నే మందునే

చ. 3: నీతోడి చుట్టరికాన నే మొక్తితే నన్నుఁ గూడె
       యీతల శ్రీవెంకటేశుఁ డిచ్చకాననూ
       నీతితో న నన్నడిగగేవు నీ వెఱఁగ వటే యిది
       యేతరీఁ డాతఁడు నీతో నే ముందునే