పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0392-2 శంకరాభారణం సంపుటం: 11-548

పల్లవి: నీవు మగవాఁడవు నెలఁత యాపె
         వేవేలకు నైనాన వింత సేయఁ జెల్లానా

చ. 1: తచ్చి తచ్చి యాపెతో తారుకాణ నీకు నేల
       యిచ్చగించి విన రాదా యింతలో నేమి
       హెచ్చినకోపానఁ జెలి యే మన్నా ననెఁ గాక
       మచ్చరించ యింత నీకు మారుమాట చెల్లునా

చ. 2: ముంచి తిట్టియాపెఁ జూచి మోవినె నవ్వఁగ నేల
       యించుక వోరుచ రాదా యింతలో నేమి
       మించలవనిత యెంత మీరినామ మీరెఁ గాక
       అంచెల సతులతో నా కాడుకొనఁ జెల్లునా

చ. 3: కూడినవేళ యాపెతో గోరఁ జెనకఁగ నేల
       యీడ జోడై యుండ రాదా యింతలో నేమి
       వేడుక శ్రీవెంకటేశ వెలఁదిఁ గలసితివి
       తోడనె తనివి లే దొమ్మి సేయఁ జెల్లునా