పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0392-1 మలహరి సంపుటం: 11-547

పల్లవి: ఎందాఁక నీసిగ్గు లేఁటికిఁ బెంచేవు
         పొందులు దొరకెను బోగించ రాదా

చ. 1: చెలఁగి నీకురులు చేతుల దువ్వుచు
       మలసెటిపతితో మా టాడవే
       సెలవినవ్వుతోఁ జెక్కులు నొక్కి
       చెలువుని చనవులు చెల్లించ రాదా

చ. 2: కదిసి చేసురటి కాంతుఁడు విసరీ
       నదె చీచేతుల నందుకోవే
       మొదల నాతఁడె ముచ్చట లాడీ
       యెదు రుత్తరము నీ వియ్యఁగ రాదా

చ. 3: ఆతఁడు కాఁగిట నట్టె బిగించీ
       నీతగ విప్పుడు నెరపఁ గదే
       కాతరపు శ్రీవెంకటఘనుఁ డితఁడు
       ఘాతలఁ గూడెను కనుఁగొన రాదా