పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0391-6 ముఖారి సంపుటం: 11-546

పల్లవి: చిత్తము వచ్చిన ట్టెల్లఁ జేసుఁ గాకా
         బత్తితోడ నేల వొడఁబరచీనె నన్నునూ

చ. 1: చేరి తనతో నవ్వి సేసపాలకు లో నైతి
       బీరాన నేఁ బొందు సేసి బేల నైతిని
       సారె సారెఁ దనవంక జాలదా నా కింత మేలు
       పోరి పోరి యిఁక నేమి బుజ్జగించీ నన్నునూ

చ. 2: కన్నులఁ జూచినందుకు కాలమందె లో నైతి
       యెన్ని తనునే నమ్మి యిం తైతిని
       మన్ననలు దనవంక మరి యింతకంటే నేవి
       కొన్నకో లై యిఁక నేమి గొంగు వట్టీ నన్నునూ

చ. 3: మాటలు దనతో నాడి మన సిట్టె తనిసితి
       యీటుకుఁ బెనఁగఁ బోయి యేక మైతిని
       గాఁటపు శ్రీవెంకటాద్రిఘనుఁడు దా నన్నుఁ గూడె
       ఆఁటదాన నేల మచ్చీ యప్పటిని నన్నునూ