పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0391-5 పాడి సంపుటం: 11-545

పల్లవి: పొంచి పొంచి మాతో నేల పురుఁడు వెట్టుకొనేవు
         నించి యిన్నిటా దొరవు నీకుఁ జెల్లదా

చ. 1: చలపట్టి మాకే నీతో జవదాఁట రాదు గాక
       నెల వై పెచ్చు వెరుగ నీకుఁ జెల్లదా
       కలది గ లట్టే మాకు కల్ల లాడ రాదు గాక
       నిలువున బొంకు బొంక నీకుఁ జెల్లదా

చ. 2: మఱఁగు లెల్లా విరులు మాకుఁ జెల్ల దింతే గాక
       నెఱి దాఁగి పొడచూప నీకుఁ జెల్లదా
       తఱిఁ గపటము మాకుఁ దగవు గా దింతే గాక
       నెఱవుదొంతగనాలు నీకుఁ జెల్లదా

చ. 3: చిమ్ముచు మాకే నీతో చేరి నవ్వ రాదు గాక
       నెమ్మది సిగ్గు విడువ నీకుఁ జెల్లదా
       నమ్మించి శ్రీవెంకటేశ నన్ను నిట్టె కూడితివి
       నెమ్మి నన్ను మన్నించ నీకుఁ జెల్లదా