పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0391-4 లలిత సంపుటం: 11-544

పల్లవి: నిన్ను మీర నోపను నే నెటువలె నుండిన
         అన్నిటా నే నీకె లో నవుతే నాతగవూ

చ. 1: యెంత విరహవేదన నెట్లా నేఁ బొరలినా
       రంతుల వేగిరించఁగ రాదు నిన్ను
       యింతకంటే నీతో నే నెంత వొట్టు వెట్టుకొన్న
       వంతలు నీయంకెలకు వచ్చుటే నాతగవు

చ. 2: ముంచి నాకు నీమీఁద మోహ మెంత యెక్కు డైన
       చంచలించి వేగరించ సంగతా నాకు
       మంచితనాననే నీకు ముందెమేళ మెంతయిన
       పొంచి నీవేళ గాచుక పొందుటే నాతగవూ

చ. 3: వరుసతో నే నీకు వద్ద నిట్టే వుండినాను
       గరిమె నే ముందు చెనకఁగఁ జెల్లునా
       నిరతి శ్రీవెంకటేశ నీవే నన్నుఁ గూడితిని
       ధరమీఁది పనులకుఁ దాలిమే నాతగవూ