పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0391-3 వరాళి సంపుటం: 11-543

పల్లవి: మొదల నేమీ నెరఁగ మూఢురాలను
         యెదుట నీయాల నేను యీడేరించ వయ్యా

చ. 1: వోపి మంచము దిగక వుందు నొక్కక్కవేళను
       రాపుగ నిన్నుఁ బొందిన రాజసానను
       కోపగింతు నొకవేళఁ గొసరుదు నొకవేళ
       ఆపాపము లే దని మా కానతియ్య వయ్యా

చ. 2: దగ్గరినవేళ నాపాదము దాఁకు నీ మేను
       అగ్గలపుమందెవేళ మట్టె కాఁగాను
       వెగ్గళింతు నొకవేళ వేసిరింతు నొకవేళ
       యెగ్గు లే దని వరము లియ్య వయ్యా

చ. 3: యేకతపువేళ నిన్ను యే మైనా నందుము నేము
       కైకొని చనవుతోడఁ గాఁగిట నించి
      యీకడ శ్రీవెంకటేశ యేక మైతి మిద్దరము
      వాకుదోసము లే దని వల లీవయ్యా