పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0391-2 మంగళకౌసిక సంపుటం: 11-542

పల్లవి: ఈపాటి మేలు సేసితి వింత చాలదా
         మాపట్టుకు నీవు గాఁగా మన్నింతిని గాక

చ. 1: వంతుకు నామనసు రావలె నంటా నాపెచేత
       పంతము లిప్పించే వేర పలుమారు
       యెంతటివాఁడవు నీవు యే మేమి సేయ నేరవు
       మంతనానా మముఁ గొంత మన్నించితి గాకా

చ. 2: ఆది గొని నేనే మైనా ననే నంటా నాపె చేత
       పాదాలకు మొక్కించేవు పలుమారు
       కా దంటే నీ వెంత కైనఁ గలవు నే నెరఁగనా
       మాదెసఁ గొంత నీవు మన్నించితి గాకా

చ. 3: యెనయ నిద్దరి నొకయింటఁ బెట్టి యాపెచేత
       పని నాకుఁ జేయించేవు పలుమారు
       కొనబు శ్రీవెంకటేశ కూడితిని నన్ను నిట్టె
       మన సిచ్చి నేఁ గాఁగా మన్నించితి గాకా