పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0390-6 సాళంగనాట సంపుటం: 11-540

పల్లవి: నిక్కము నేఁడు మా పొందు నీకు వలెనా
         చక్కని విభుఁడ యింత చవి వుట్టీనా

చ. 1: మనసు దెలసి నాతో మాట లాడే విప్పు డిట్టే
       తనిసి నేఁ డైన నీచిత్తము వచ్చెనా
       చెనకి నామీఁదఁ దెచ్చి చేయి వేసే వప్పిటిని
       వెనకముందరి బుద్ది విచారించుకొంటావా

చ. 2: నయగారమును మాతో నవ్వఁ జూచే విప్పు డిట్టే
       జయ మైన సిగ్గు దేరి చలి వాసెనా
       ప్రియపడి నన్నుఁ గడు పేరుకొని పిలిచేవు
       క్రియతో నీ కింతపని కిమ్ములఁ గలిగెనా

చ. 3: చొక్కుచు నా మోముదిక్కు చూచేవు సారె సారె
       పుక్కటై నీలోని వలపులు రేగెనా
       యిక్కు వంటి శ్రీవెంకటేశ నన్ను గూడితివి
       దిక్కుల నీగుణములు తిద్దుకొంటివా