పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0390-5 సాళంగం సంపుటం: 11-539

పల్లవి: చెల్లనో నీ వింత నాకుఁ జెప్ప వలెనా
         బల్లిదుఁడ నాకు నీ బలు వుండఁగా

చ. 1: సందడించి యవ్వరితో జడగడాలు మా కేల
       కందు వై నీవు నాకుఁ గలి గుండఁగా
       మందలించి కన్నవారిమాట విన నా కేల
       కిందట మీఁదట నీకృప యుండఁగా

చ. 2: పొట్టఁబిరుగువారితో పురుఁడు నా కది యేల
       యిట్టె నీవు నాకుఁ జన విచ్చి యుండఁగా
       వట్టి విచారము లేల వగలఁ బొరల నేల
       గుట్టుతో నీబాస నాకు గురి యుండఁగా

చ. 3: కడవారితో నింకఁ గాఁతాళము నా కేల
       ఆడరి నీకాఁగిలి నన్నంటి యుండఁగా
       బడినె శ్రీవెంకటేశ పాయక నన్నుఁ గూడితి
       జడియ నేల వలపు సరు లయి వుండఁగా