పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0390-4 గుండక్రియ సంపుటం: 11-538

పల్లవి: మగవాఁడు గూళ యైతే మరి చేతఁ బట్ట రాదు
         తగ వెరఁగక నీవే తమకించే విదివో

చ. 1: అంగనకు నీమనసు అరిసి తెలయుదాఁకా
       నంగవించి నవ్వ దాయ నందుకే కదా
       కుంగుచు నీవది చూచి కోపగించి వున్న దంటా
       నండగిఁ బెట్టి వలపు లాడుకొనే విదివో

చ. 2: పడఁతికి నీ వాకడి పరాకు మానినదాఁకా
       నడరి నీతో మాటాడ దుందుకే కదా
       కడగి నీతో నాపె కైకొనక వున్న దంటా
       వుడివోక గోర సేసి వుప్పతించే విదివో

చ. 3: జలజాక్షికిని నేవీ చనవు లిచ్చినదాఁకా
       నలమక వూరకుండె నందుకే కాదా
       యెలమి శ్రీవెంకటేశ యిట్టె నీవే కూడితివి
       చలము చెల్లించే నంటా జట్టిగొనే విదివో