పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0390-2 పాడి సంపుటం: 11-536

పల్లవి: ఈపాటి కీపాటి యిఁక నెంతో
         కోపగించ రాదు నీతో కూటములు చెల్లునా

చ. 1: సెలవుల నవ్వితేనె చెరఁగు వట్టెవు నీవు
       యెలమి నాల నైతే యెంత సేతువో
       బలవులతోడి పొందు పై వచ్చునై వచ్చు
       చలము సాదించ రాదు చాలు నోప నందుకు

చ. 2: మచ్చికె నిన్నుఁ జూచితే మంచానకుఁ దీసేవు
       యిచ్చలు నీకుఁ జేసితే నెంత నేతువో
       వచ్చెఁ బలివేలు మాకు వరుస లిందే కంటిమి
       మచ్చరించ రాదు నాతో మాట లింతే సేఁటికి

చ. 3: వొంటి నే నిలుచుంటెనే వూరకే కాఁగిలించేవు
       యింటికిఁ బిలచుకొంటే నెంత సేతువో
       గొంట వై శ్రీవెంకటేశ కూడితిని నన్ను నిట్టె
       దంట నై జంకిం రాదు తతి వచ్చె నీకును