పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0390-1 గుండక్రియ సంపుటం: 11-535

పల్లవి: కంటి వటె నామీఁదఁ గల బత్తి యీతనికి
         గొంటుఁదనమునఁ దానె కొంకీ నాచేఁతకు

చ. 1: నంటు గలవారిఁ గంటే నవ్వ బుద్ది వుట్టుఁ గాక
       కంటకపు వారికిఁ గలదా సొంపు
       అంటి ముట్టి నే సరస మాడఁగా నా కినగోరి
       ముంటివాఁడి సోఁక కుండా మొక్క వచ్చీ నితఁడు

చ. 2: యేకచిత్త మైనచోట నిన్నియు నితవు గాక
       చీకాకు వడినచోటఁ జెప్పఁ గలదా
       కైకొని నేఁదను నెంత కరఁగించి మాటాడినా
       ఆక డీకడి మాటలు ఆలకించీ నితఁడు

చ. 3: యంత నే విన్నవించఁగా నియ్యకొని కూడెఁ గాక
       చెంత నే నాడక వుంటేఁ జిత్తగించీనా
       పంతపు శ్రీవెంకటాద్రిపతి యిప్పుడు నారతి
       మంతనానఁ జిక్కి చొక్కి మచ్చి కాయ నితఁడు