పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-6 ముఖారి సంపుటం: 11-534

పల్లవి: ఇంతేసి మాయలు పతి యెరుఁగునో యెరఁగఁడో
         చింత దీర నాతనితోఁ జెప్పరమ్మ చెలులు

చ. 1: దగ్గరి యాతనితో నే తమితో మాట లాడితే
       ఆగ్గలపుసతులు గయ్యాళి యందురూ
       సిగ్గు పడి వూర కున్న చెంగలించి వెంగెముల
       నిగ్గుల ని దేమియు నేర దందు రూ

చ. 2: నయమున నేఁ గొంత నవ్వులు నవ్వఁగఁ బోతే
       బయకారా లని వారే పచ్చి వేతురు
       దయతోడ గుట్టు సేసి తల వంచుకొని వుంటే
       నియతి నలిగె నంటా నెట్టన గడింతులు

చ. 3: కతగా శ్రీవెంకటేశుఁ గలసి మెప్పించితేను
       రతులలో ని దెంతటి రాఁగ యందురూ
       యిత వై యీతఁడు నన్న నింతగా మన్నించి కూడె
       మతక మింతయును నామర్మమే యందురూ