పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-5 సాళంగం సంపుటం: 11-533

పల్లవి: అన్నిటాఁ దన్నుఁ జూచుకొ మ్మనరే మీరు
         వున్నమచంద్రువెన్నెల భూమి కెల్లాఁ గాదా

చ. 1: యెంత నన్ను బుజ్జగించి యెటువలెఁ బెట్టు కున్నా
       అంతయునుఁ దనమే లనరే మీరు
       పొంతనె పాదాలమీఁదఁ బూజించినపెద్దరికె
       మంతట దేహన కెక్కు నదియే కాదా

చ. 2: సారె సారె దా నెంత చనవు నా కిచ్చినాను
       ఆరయఁ దనలాభమో అనరే మీరు
       నేరుపుతో వేళ్లపై నీళ్లెల్లాఁ బోసితేను
       కూరిమినా తని వెల్లాఁ గొనలకే కాదా

చ. 3: సరి నన్నుఁ గూడి నా మైచలు వెంత వేసినాను
       ఆరిది తనకె పుణ్య మనరే మీరు
       యిర వై శ్రీ వేంకటేశుఁ డింత వేసి నన్నుఁ గూడె
       మరిగె పండ్లతీపు మాకు వల్లఁ గాదా