పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-4 హిందోళం సంపుటం: 11-532

పల్లవి: ఏమి సేసితి విందాఁకా నేడ నుంటివి
         చే ముంచి యాపెను నీవే నేద దేర్చవయ్యా

చ. 1: యింతి నీవు వచ్చే వంటా నిందాఁకా నెదురు చూచె
       అంతయు నీతోఁ గొంచి యాడఁ జాలదు
       చింతతో నున్నది చెలి చెక్కు నొక్కి యీపెకు
       సంతోసము సేసి మోవి చవి చూపవయ్యా

చ. 1: నీవే పిలిచే వంటా నిలుచుండె నిందాఁక
       ఆవలిమాటలు నిన్ను ననఁ జాలదు
       కోవరపుఁ దమకాన గుట్టుతో వున్నగి యీపెఁ
       జే వట్టి బుజ్జగించి చిత్తగించవయ్యా

చ. 3: పవళించే వంటాను నీపైనే కన్ను లిందాఁకా
       అవుఁ గా దనుచు నిన్ను ననఁ జాలదు
       వివరించి కూడితి శ్రీవెంకటేశ యీసతిని
       కవ వాయ కిట్లానె కైకొ నుండవయ్యా