పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-3 సాళంగనాట సంపుటం: 11-531

పల్లవి: పెలుచుఁ గోపపుదాన బిరుదుకు మొదలను
         యెలమి నీగుణాలే న న్నింత వలపించెను

చ. 1: తత్తరించి నే నిన్ను తగుల నాడినందుకు
       చిత్తన నొవ్వక నన్నుఁ జేర వచ్చేవూ
       మత్తిలి నేఁ గోసరితే మరి నీవు నవ్వేవు
       యిత్తల నీమంచితనా లింత వలపించెనూ

చ. 2: గక్కన నీరాకు నేఁ గైకో కుండినందుకు
       అక్కర దీరన న్నంటి ఆదిరించేవూ
       వొక్కటి గా కూరకున్న వొడఁబరచ వచ్చేవు
       యిక్కువ నీ నేరువు న న్నింత వలపించెనూ

చ. 3: వొంటిఁ గాఁగిలించఁగాని నిన్నొట్టు వెట్టినయందుకు
       బంటువలె వెంట వెంటఁ బాయ కుండేవూ
       అంట కుంటే శ్రీవెంకటాధిప నన్నుఁ గూడితి
       వింటనే నీ చనవులు యింత వలపించెనూ