పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-2 సాళంగనాట సంపుటం: 11-530

పల్లవి: ఎవ్వరితోడ గొడవ లిఁక నేలా
         యివ్వల మ మ్మిందులోనే యేల పొగడేవు

చ. 1: సన్నల సారెకు మెచ్చ సణఁగు నీపైఁ జల్ల
       కన్నులెదుట నీ కాపె గలిగెఁగా
       మన్ననలు పచరించ మాటికి మాటికి నవ్వ
       అన్నిటిమారును నీవు ఆపెకుఁ గలితి గా

చ. 2: యిచ్చకము నీకు నాడ యే మైనఁ బనులు సేయ
       గచ్చుల నీకు నేఁ డాపె గలిగెఁ గా
       చెచ్చెర వాసు లెక్కించ చెప్పినపనులు సేయ
       నిచ్చ నిచ్చ నాపెకు నీవు గలితివి గా

చ. 3: అంది నీకాఁగిఁట గూడ నాయము గరఁగి చొక్క
       కందువ లంట నీ కాపె గలిగెఁ గా
       అందపు శ్రీవెంకటేశ ఆపెఁ గూడి నన్నుఁ గూడి
       తిందులో మాయిద్దరికి నిటు గలితివిగా