పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-1 సాళంగం సంపుటం: 11-529

పల్లవి: కొసరి ని న్నింతలోనె కోపగించేనా
         ముసిముసి నవ్వు లెల్లా ముచ్చటలె కావా

చ. 1: తలఁపులో నీరూపు తగిలి పాయ కుండఁగ
       యెలమి విరహతాప మెక్కడిది
       వెలయ నిందుకుఁ గాను వేఁడుకొనే వేల నన్ను
       నలువంక నీమేలె నామేలు గాదా

చ. 2: చేకొని నీ కంకణము చేతఁ జిక్కి వుండఁ గాను
       యీక డాకడి మాటకు నెగ్గు లేది
       వాకున నిందుకుఁ గానె వైపులుగా నమ్మించేవు
       నీకుఁ గలసంతోసమే నేఁడు నాకుఁ గాదా

చ. 3: కందువ నీవే నాయింటఁ గాణా చై వుండఁగాను
       చెంది నామనవి నీతోఁ జెప్ప నేది
       అంది శ్రీవెంకటేశ నన్నలమితి కడపలో
       విందుల నీవేడుకే నావేడుకలు గావా