పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0388-6 తెలుఁగుఁగాంబోది సంపుటం: 11-528

పల్లవి: తను నేమి సేసితినే తా నేల తమకించేనే
         యెనయఁగా నూరకున్న దిదే నా నేరమి

చ. 1: తగుల నాడినదదానఁ దల వంచు కుండ నైతి
       నగితి నింతే పో నా నేరమీ
       మొగుము చూచినదాన మోనము గైకొన నైతి
       అగపడి లో నైన దదే నా నేరమీ

చ. 2: యింటికి వచ్చినదాన నే మైనాఁ గొసర నైతి
       నంటున నే నుంటి నది నా నేరమీ
       అంటినదాన నే నట్టె చెనక నైతి
       వొంటి మొగమోటల నే నున్నదే నా నేరమీ

చ. 3: నెమ్మదిఁ గూడినదాన నిజబా సడుగ నైతి
       నమ్మితి నే నిదయె కా నా నేరమీ
       వుమ్మడి శ్రీవెంకటేశుఁ డొగి నిట్టె నన్నుఁ గూడె
       సొమ్మల మై మఱచి నేఁ జొక్కినదే నేరమీ