పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0388-5 భవుళి సంపుటం: 11-527

పల్లవి: ఏమి సేసినా నీ చిత్త మింతే కాక
         కాముకుఁ డైన నిన్నుఁ గా దనేటివారమా

చ. 1: నేరిచినవారుగా నీతో మాటాడేది వే
       మారును నెదు రాడఁగ మా కేటికి
       కారణము గలిగి కా కమ్మర నీతో నవ్వేది
       యీరీతి నీతోఁ గెలయ నెంత పని మాకును

చ. 2: అంత కోపినప్పుడుగా నట్టె నిన్ను దగ్గరేది
       మంతనాలు విన్నవించ మా కేఁటికి
       పంతము నే నాడితేఁగా బలవు నీతోఁ జూపేది
       యెంత కెంత నీసుద్దులు యేమి పని మాకునూ

చ. 3: నేనే నీ వయితేఁగా నిజ మని నమ్మేది
       మానక వావులు చెప్ప మా కేఁటికి
       పూనుక శ్రీవెంకటేశ బుజ్జగించి కూడితివి
       యే నెపాలకు నింక నేమి పని మాకును