పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0388-3 నారణి సంపుటం: 11-525

పల్లవి: కల మీ సహజానకు కన్నుల మెచ్చుట గాక
         తలపోసి మి మ్మడుగఁ దగవా యీవేళనూ

చ. 1: పడఁతి నీమోము చూచి పకపక నవ్వు నవ్వి
       చిడుముడి నీచేతిపై చేయి వేసేను
       అడరి మీలోని మర్మా లనవి యేమి గలవో
       తడవఁగ మాకు నంత దగవా యీవేళను

చ. 2: సారె సారె సన్న సేసి చాయలు దొరల నాడి
       మోరతోపుఁదనమున మొక్కు మొక్కెను
       కారణ మేఁటికో కాని కందువ మీకే తెలుసు
       తారుకాణించఁగ మాకుఁ దగవా యీవేళను

చ. 3: చెనకి పాదము దొక్కి చెలిలోన మాట చెప్పి
       ఘనముగ నిన్ను నాపె కాఁగిలించెను
       అనుగు శ్రీవెంకటేశ ఆడుకోలుమాటలేవో
       తనివి నిట్టె పాగడఁ దగవా యీవేళనూ