పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0388-2 రాయగౌళ సంపుటం: 11-524

పల్లవి: ఎప్పటివలెనే చన వియ్య రాదా
         తప్పు లేనిసతి నింక దయఁ జూడ రాదా

చ. 1: నాలితో నాపె నిన్ను నవ్వుతా నన్న మాఁటకు
       యేల కోపగించుకొనే వింతలోనే
       మీలోనే యిటు లైతే మెత్తురా లోకమువారు
       తాలిమితో నింతి నింక దయఁ జూడ రాదా

చ. 2: చనవు చేసుక యాపె జంకించనయందుకు
        యెన లేక చిన్నఁ బొయ్యే వేఁటికి నీవు
        కొనగొన మీకు మీకు కోపము లింత చెల్లువా
        తనిసి నీ దేవులను దయఁ జూడ రాదా

చ. 3: చుట్టరికమున నాపె సూడు వట్టినందుకు
       యెట్టు పెనఁగఁ బోయి నితవు లవునా
       యిట్టె శ్రీవెంకటేశ యింతలోఁ గూడితి వీపెఁ
       దట్టు ముట్ట సేయ కిట్టె దయఁ జూడ రాదా