పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0388-1 ముఖారి సంపుటం: 11-523

పల్లవి: ఏ లోయి మాతోడి యెగసక్యాలు
         జాలిఁ బడి వున్నవారి సట సేసేవా

చ. 1: సెలవుల నవ్వు నవ్వి చేతి పువ్వుబంతి వేసి
       యెలమి మాకోపము నేఁ డేల రేఁచేవు
       వులి వచ్చి విరహన నుడుకుతా నుండేవారి
       వలపుల యెండలనే వడ చల్లేవా

చ. 2: దగ్గరనే నిలుచుండి తతిగొని చన్ను లంటి
       యెగ్గులతిట్ల మాచే నేల పడేవు
       నొగ్గిన సిగ్గులతోడ నుట్టి లేక వూఁగేవారి
       అగ్గలపుటాసలవుయ్యల లూఁచేవా

చ. 3: చేరి పచ్చడము గప్పి చెక్కు నొక్కి కాఁగిలించి
       యీరీతి మన్నించి మమ్ము నేల మెచ్చేవు
       కూరిమి శ్రీవెంకటేశ కూడిన మావంటివారి
       నేరా తరితీపుల నెలయించేవా