పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-6 నాదరామక్రియ సంపుటం: 11-522

పల్లవి: చెల్లు లేవే యాతఁడు నీచేతఁ జిక్కెనే
         పల్లదమే తల్లి నీకుఁ బాలతోనే పోసెనే

చ. 1: తెగువలు వచరించ తేనెలమాట లాడ
       పగటుల నడవ నీపాలఁ బోయనే
       మొగమిచ్చలు నెరవ ముసిముసినవ్వు నవ్వ
       తగవులఁ బెట్ట నీకు తతి వచ్చెనే

చ. 2: సారెకు మొక్కులు మొక్క చలములు సాదించ
       ఆరీతి నాన వట్టె నీ కలవా ట్లాయనే
       నేర మొకరిపై వేయే నీచేయి మీఁదు సేయ
       నేరుపు నాలితానలు నీ వియ్య వలెనే

చ. 3: అరగపటము చూప నంతలోఁ దిరుగ వేయ
       సరిఁ జిన్ననాఁడె యిన్ని సాధించితివే
       గరిమ శ్రీవెంకటేశుఁ గలసి న న్నే లించితి
       సరి వచ్చితే మెచ్చ జాణ వైతివే