పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-5 శ్రీరాగం సంపుటం: 11-521

పల్లవి: నీవు సేసేపనులకు నేర మేది
         తావుల నాతోఁ బెనఁగఁ దగ వేది

చ. 1: వెలఁదులతోడనె వేగువంతాఁ బట్టె నీకు
       వెలయ మాయింటికి రా వేళ యేది
       కులికి మాకాతరానఁ గొసరేము గాక నిన్ను
       పలుమారుఁ బలికించ బలు వేది

చ. 2: యెక్కడనోఁ దిరుగాడ నిందాఁక బట్టె నీకు
       దిక్కి మాతో రతి సేయ దల పేది
       మక్కువ సేసితి గాన మాన లేము గాక నిన్ను
       తక్కులఁ బెట్టగ మాకుఁ దగ వేది

చ. 3: ఆదరించి నీమీఁద నాన వెట్టఁ బట్టె నీకు
       సోదించి ని న్నవుఁగా దనఁ జో టేది
       ఆదెస శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       ఆదిరించి కూడితివి అడ్డ మాడ నేది