పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-4 రామక్రియ సంపుటం: 11-520

పల్లవి: ఎంతయిన మానవు ని న్నేమి సేతును
         పంతపు నీసుద్దులకు భ్రమ సున్నదానము

చ. 1: నగదు గాదు లీతోడ నాఁడె నేఁ జెప్పనా
       తెగి మాలో నవ్వితే నేఁ దిట్టుదు నవి
       మొగము చూడఁగ నీకు ముందెనే మొక్కనా
       తగుల నాడకు మమ్ముఁ దడవకు మనుచు

చ. 2: నను పై యిన్నా ళ్లాయ నాతలఁ పెరఁగవా
       తనివోని కక్కూరితిదానఁ గాన నీ
       చనవు నేసి యింతుల సాకిరులుఁ బెట్టనా
       పెనఁగకు మమ్ముఁ బేరఁ బిలువకు మనుచు

చ. 3: నీ వేల నమ్మవో కాక నీవే నేఁ గానా
       వాని నీవు దెలయవా వదినె నని
       ఆవల శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       తావులఁ గూడితి వింకఁ దమక మే లనుచూ