పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-3 భైరవి సంపుటం: 11-519

పల్లవి: ఏమి నేతు నిందుకు ని న్నెటువలె వేఁడుకొందు
         చే మంచి నీమోము చూడ సిగ్గయ్యీ నాకు

చ. 1: వేడక నాపె యింటికి విచ్చేయఁ గాఁ జూచి
       వోడక నే లేవ నైతి నుడుకనను
       యీడ నాతోఁ జెప్పే విను యెంత దోసకారినో
       యీడ జో డై సవతిపో రింత సేసే నయ్యా

చ. 2: యిచ్చగించి ఆపెతేనె యిట్టె నవ్వఁగాఁ జూచి
       మచ్చరాన నీతోడ మా టాడ నైతి
       కచ్చుపెట్టి నే నెంత కట్టడి మతిదాననో
       యెచ్చి నాజవ్వనమద మింత సేస నన్నును

చ. 3: గక్కన నాపైకు నీవు కనున్న నేయఁ జూచి
       యెక్కువ నీ వున్నమంచ మెక్క నైతిని
       అక్కర శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       యిక్కువ నీతోడికూట మింత నేనె నన్నునూ