పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-2 ఛాయనాట సంపుటం: 11-518

పల్లవి: వట్టి సటలకు తల వంచ నేలే
         మట్టు మీరేపని యైతే మానుప కుండేనా

చ. 1: కాతరాన నీవిభుఁడు కదిసి యేపొద్దు నీ
       చేతికి లో నై యుండఁగ చింత లేలే
       ఆతల నొక్కతెయింట నాతఁ డుండఁగాఁ జూచితే
       యేతుల నీ వే మన్న నియ్యకొందుఁ గాకా

చ. 2: చంచలము దీరి నిన్ను సమ్మతించఁ జెప్పి నీతో
       ముంచి నవ్వులు నవ్వఁగ ముసుఁ గేలే
       పంచల నాతఁడు వేరే పరా కై వుంటేఁ గనక
       వంచన నీకుఁ గా పత్రివాదుల మై యుండేమా

చ. 3: అక్కజపు యేకతాన నంగము లంటుచు నీ
       చెక్కులు నొక్కఁగా నీకు సిగ్గు లేలే
       అక్కర శ్రీవెంటకేశుఁ డలమేలుమంగవు నీ
       విక్కువతోఁ గూడితివి యిట్టె సంతోసించవే