పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-1 నాగవరాళి సంపుటం: 11-517

పల్లవి: ఇన్నియు గన్నట్టిమీఁద నిఁక నేలా
         యెన్నికలు నీకు నాకు నిఁక నేలా

చ. 1: పొదిగి నీ వనఁ గాను పూఁచి నిన్ను నే నాడఁగా
       యెదురుబడి మాటలు యిఁక నేలా
       కదిసి యీవలఁ జూచి కన్నవారె నవ్వఁ గాను
       యిదివో మనలో వాదు లిఁక నేలా

చ. 2: సారె సారె నీవు నేను సరసము లాడఁ గాను
       యీరు దియ్యఁ బేను వచ్చు నిఁక నేలా
       మోరతోపుఁదనములు మొగములో నుండఁ గాను
       యీరీతి సాకి రడుగ నిఁక నేలా

చ. 3: పంతముల నిందాఁకఁ బరాకులె పచరించి
       యింతలోనె యిచ్చము లిఁక నేలా
       అంతటి శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       యింతటఁ గూడితి రేసు లిఁక నేలా