పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0386-6 కురంజి సంపుటం: 11-516

పల్లవి: ఎప్పటివాఁడవె కావా యెరుఁగుదుము
         తప్పులు పట్టఁగ నిన్నుఁ దగ దయ్య మాకును

చ. 1: చనవు సేసుక నే నీసరి నిలుచుందుఁ గాక
       మన సిచ్చి నీవు నాతో మాట లాడేవా
       వనిత లి దెరఁగరు వడి నేఁ గైకో నందురు
       అనుమాన మెల్లఁ బాసె నంపవయ్య మమ్మును

చ. 2: వూర కైనా నేనే వట్టి వూడిగాలు సేతుఁ గాక
       మేరతో నీవు గొంతైన మెచ్చఁ బొయ్యేవా
       నేర మెల్లఁ దీర నేఁడు నిన్ను ముదులకించితి
       పోర నోప‌ నీతోను పోవయ్య్‌ చాలును

చ. 3: నంటున నీతో నేనే నవ్వులు నవ్వుదుఁ గాక
       జంట యై నీ వట్టె సరసము లాడేవా
       అంటిని శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       యింటికి వచ్చి కూడితి వేల వయ్య నన్నునూ