పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0386-5 దన్నాసి సంపుటం: 11-515

పల్లవి: ఎఱఁగ మిన్నాళ్లు నీ విటువంటివాఁడ వవుట
         ఉఱక లేనిగుణము లొక్కటే వే యాయను

చ. 1: మంచివానివలెనె మాటలు వెలుచుకొని
       పొంచి నవ్వుతాఁ జెప్పేవు పొలఁతికిని
       యెంచఁగా నాపె నీకు హితవరురాలు గాని
       పంచల వేయఁగ నీకుఁ బగవారమా

చ. 2: నామంచముమీఁద నుండి నయముల సట చేసి
       కామించి యాపెమీఁదఁ గాలు వేసేవు
       ప్రేమ నాపె నీకు సేస పెండ్లికూఁతు రాయఁగాని
       నేము వెట్టికి వచ్చిననెలఁతల మైతిమా

చ. 3: వురముపై నే నిట్టె వుండఁగా శ్రీవెంకటేశ
       కరఁగించి యాసతికిఁ గత చెప్పేవు
       యెరవుగా నాపెఁ గూడి యింపుగా నన్నుఁ గూడితి
       నిర తలమేల్‌‌మంగను నేనే మేలుదానాన