పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0386-4 కాంబోది సంపుటం: 11-514

పల్లవి: బలిమి సేయఁగ నీతోఁ బంతమా నాకు
         పలచఁగా నిన్ను నాడఁ బంతమా నాకు

చ. 1: యిట్టె నీసతులు యే ముందురో అని కాక
       పట్టకు మని కోపించఁ బంతమా నాకు
       చుట్టుకొన్న నీతగవు చూడవల సింతే కాక
       బట్టబయ లీదించఁ బంతమా నాకు

చ. 2: మోసాన నెవ్వతె కైనా మొక మోడే వని కాక
       పాసి వేరే మంచ మెక్కఁ బంతమా నాకు
       వాసుల నీ మతిలోని వల పెరఁగక కాక
       బాసలు నిన్నుఁ జేయించఁ బంతమా నాకు

చ. 3: ఆడిరి మరి నొకతె నాసపడీ నని కాక
       బడలించి రతి సేయఁ బంతమా నాకు
       వడి శ్రీవెంకటేశుఁడ వా నలమేలుమంగను
      బడి వాయ నియ్యకుండఁ బంతమా నాకూ