పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0386-3 ఆహిరి సంపుటం: 11-513

పల్లవి: ఇందాఁక రా కుండితే నిది పావగా వలెనా
         చందాలు చెప్ప వచ్చేవు సాదించ వచ్చేమా

చ. 1: ముందరికి రా రాదా మో మైనఁ జూచేను
       చెంది యింతలో నేల సిగ్గు వడేవు
       అందు కేమి మాచుట్టమ వవుత గల్లా యెంతయిన
       కందువఁ బెనఁగ నిదె కడ మయ్యీనా

చ. 2: పీఁటపైఁ గూచుండ రాదా పిసికేము పాదాలు
       యేఁటి కని వొద్దనేరా యెవ్వ రైనాను
       యీటు లేనిమగవాఁడ వేమి సేసినా నేమి
       కొటిసతులఁ బొందిన కోపగించేనా

చ. 3: పచ్చడము గప్ప రాదా పక్కనఁ గరఁగించేను
       చెచ్చెర నేల నవ్వేవు సెలవులను
       అచ్చపు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       నిచ్చఁ గూడి యున్నారమ నీవే నేఁ గానా