పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0385-6 బలహంస సంపుటం: 11-510

పల్లవి: మిక్కిలి జాణవు నీవు మే మేమి బాఁతి
         పక్కన నీ వన్నిటాను బదికితేఁ జాలదా

చ. 1: కూరిములు చల్లుతానె కొసరేగుణము మాది
       నేరపు మా కున్నదా నేరమే కాకా
       మేరతోడి మ మ్మేల మేకులు సేసేవు రతి
       ధీరుఁడవు నీవు మాతెరువు రా వలెనా

చ. 2: నించేసరసములోనె నిండువిరసము మాది
       మంచితన మున్నదా మాటలే కాకా
       యెంచ నేల మమ్ము నీవు యిల జాణలలో నెల్ల
       అంచె నూడి పడ్డవాఁడ వంత మాతో వలెనా

చ. 3: చనవునఁ గూడుతానె జంకించేగుణము మాది
       తనివి మా కున్నదా తమియే కాకా
       అనుఁగు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       పెనఁగి కూడితి వింక బెట్టి నవ్వ వలెనా