పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0385-4 మధ్యమావతి సంపుటం: 11-508

పల్లవి: దాని కేమి మీఁదటను దైవమే మేలు సేసీని
         తానే యింత చేసు నట తగటు వోయినా

చ. 1: యింత మోహించిననేనె యింటికి రాఁ జెల్లుఁ గాక
       పంతగాఁడు తన కేలే పైకొనను
       కాంతుఁడు మ మ్మింత నేసి కట్టుకోనీ యామేలు
       యింతలోనే సతులకు హీన మయ్యీనా

చ. 2: మనసు లెంతైన నేనె మాటాడించ వలెఁ గాక
       తనిసితన కేలే తత్తరించను
       ఘనరాజసముతోఁ దా గడకూ బదుక నీవే
       వనితల కిందువంక వాసి దప్పీనా

చ. 3: కాఁకఁల బొందిన నేఁ గాఁగిలింతుఁ గాక మా
       వీఁకకు రాఁ దన కేలే వేడుకకాఁడు
       ఆఁకల శ్రీవెంకటేశుఁ డలమేలుమంగ నేను
      యేఁకటఁ గూడితి మిఁక నెఱ మయ్యీనా