పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0385-3 నాదరామక్రియ సంపుటం: 11-507

పల్లవి: ఏల వేగిరింపించేరే యేమిరే వో చెలులాల
         చాలుకొన్న నాయకుని చరితలు చూడకా

చ. 1: నగినయంతటిలొనె నాకు దగ్గర వచ్చునా
       తెగ నాడి మన సెల్లఁ దెలియకా
       మొగుము చూచె నంటాను ముచ్చ టాడ వచ్చునా
       మగవాఁడని లోనిమర్మములు గానకా

చ. 2: వద్ద నున్నాఁ డంటాను వావి చెప్ప వచ్చునా
       కొద్ది నాతఁ డుండేటిగు ట్టెరంగకా
       పెద్ద చేసె నంటానె పెనగొన వచ్చునా
       వుద్దండీఁ డీతని మేనివొరపు లరయకా

చ. 3: యింటికి వచ్చె నంటాను యియ్యకొన వచ్చునా
       అంటిము ట్టాతనిసుద్దు లడుగకా
       దంట శ్రీవెంకటేశుఁడు తా నలమేలుమంగను
       జం టాయ మీర వచ్చునా చవులు సోదించకా