పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0385-1 హిజ్జిజి సంపుటం: 11-505

పల్లవి: పో పో యి దేడ సుద్ది పొద్దు వోదా తనకు
         దూపకు నేయి దాగేటిదూరు గాకా

చ. 2: యింతిని వద్దఁ బెట్టుక యేల పిలిచీనె నన్ను
        బంతిఁ గట్ట రతు లేమి పసులదొడ్డే
        దొంతులవేడుకలను తొల్లె తా మోల లాడిరి
        యింతలోనఁ జల్లారిన యీ చ వింతే కాక

చ. 2: కమ్మి యాపెపై నొరగి కమ్మటి నన్నేల పట్టీ
       కుమ్మి చిందులాడ నేమి గొల్లదోమటే
       అమ్మరో తా మిద్దరును అన్నిటాఁ గరఁగి మీఁద
       చిమ్ములాన నవ్వితేనె నెల వౌఁగాకా

చ. 3: కన్నుల నొక్కతెఁ జూచి కాఁగిట నన్ను బిగించీ
       పన్నినవలపు రేమి బండికండ్లా
       యిన్నిటా శ్రీవెంకటేశుఁ డిద్దరిఁ దాఁ గూడినాఁడు
       మన్నించ నాపెతో సరి మరిగితిఁ గాకా