పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0384-6 రామక్రియ సంపుటం: 11-504

పల్లవి: ఒద్దన్నా మానవు నన్ను నొడఁబరచేవు నీ
         వద్ద యెమ్మెలు మెఱయ వారు వీరు చాలరా

చ. 1: కొండవంటి దొర వని కుంచ నీవు వేయఁ గా న
       న్నండఁ గూచుండు మనుచు నాన వెట్టేవూ
       దండితోడ నూడిగపుదాన నయ్యే నంటే నేల
       చండి పోరి నీదేవులసానిఁ జేసే వయ్యా

చ. 2: అందచందమునను నీ కాకు మడి చియ్యఁ గాను
       అందల మెక్కు మనుచు నాన వెట్టేవూ
       గొందినె నీపాదాలు గొలిచి వచ్చే నంటే
       యిందరిలో దొర గాన న్నెంత సేసే వయ్యా

చ. 3: కట్టడతో నీమేనఁ గస్తూరి నేఁ బూయఁ గాను
       అట్టె కాగిలించు మంటా నాన వెట్టేవూ
       గుట్టుతో శ్రీవెంకటేశ కూడితి వింతలో నన్ను
      మట్టుతో నుండఁగా నెంత మన్నించే వయ్యా