పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0384-4 కొండమలహరి సంపుటం: 11-502

పల్లవి: చేగ మీరినపనులే సేసే వెల్ల
         బాగు మీరఁ దన కది పై వచ్చే దెరఁగఁడూ

చ. 1: సిగ్గు వడి తనుఁ జూచి సిరసు వంచుకొంటేను
       దగ్గరి రమ్మంటి నంటా దండ చేరీని
       వెగ్గళించ నైతిఁ గాక విదలించి వేసి నేను
       బగ్గనఁ దిట్టితే తనభావము చూచీనా

చ. 2: యెదుట నిలవుక నేనింటిలోని కేఁగితేను
       అదె సన్న సేసుక నన్నంట వచ్చీని
       పదర లే నైతిఁ గాక పక్కనఁ బువ్వులబంతి
       నెదరొమ్ము వేసితేను యే మనీనె యపుడూ

చ. 3: నెల వై పానుపుమీఁద ముసుఁగు వెట్టుకుంటే
       కలయు మనే నంటాఁ గాఁగిలించీని
       యెలమి శ్రీవెంకటేశుఁడింత నేరుపునఁ గూడె
       బలి మైతే నాతోడఁ బంత మాడఁ గలండా