పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0384-3 శంకరాభరణం సంపుటం: 11-501

పల్లవి: కానీవే తనవేసాలు కనుఁగొంటిఁ గా
         వీనులకు యీసుద్దులు వెర గాయఁగా

చ. 1: చెప్పరే చెప్పరే వీనిచేఁతలు నాకు
       అప్పుడే యాపెతో మాట లాడి వచ్చెవా
       ముప్పిరి నా కిఁక నేఁటి మొకమోటమే
       తప్పని బొంకనివాఁడు తా నెందు వోయీనే

చ. 2: యెంత కెంత వీనిసుద్దు లేల దాఁచేరే
        దొంతిగా నాపెను వెంటఁ దోడి తెచ్చెనా
        పంతపుమోనము లిఁకఁ బనికి రావె
        సంతసమే చేసేఁ గాక జగడించేనా

చ. 3: యే మంటి రే మంటిరే యెఱఁగ నేను
        చే మట్టి యాపెను నాచేతి కిచ్చెనా
        కామించి శ్రీవెంకటాద్రికడపరాయఁడు నన్ను
        గోమునఁ గూడె నిదియుఁ గొంత వలెనా